డ్రైవర్‌కు కరోనా.. మహేష్ ఫ్యామిలీ టెస్ట్ చేయించుకోగా..!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సెకండ్ వేవ్ సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సీక్రెట్‌గా కరోనా టెస్ట్ చేయించుకున్నట్టు ఫిలింనగర్‌లో టాక్ బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఆయన డ్రైవర్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న మహేష్ కూడా వెంటనే టెస్ట్ చేయించుకున్నట్టు తెలుస్తోంది.
మహేష్ బాబు తాను టెస్ట్ చేయించుకోవడమే కాకుండా గుట్టు చప్పుడు కాకుండా తన ఫ్యామిలీకి కూడా కరోనా టెస్ట్ చేయించినట్టు సమాచారం. అయితే మహేష్ సైలెంట్‌గా విషయం బయటకు రాకుండా టెస్ట్ చేయించుకోగా.. ఆయనకు నెగిటివ్ అని తేలిందని తెలుస్తోంది. తన టెస్టుకు సంబంధించిన విషయాన్ని మహేష్ చాలా సీక్రెట్‌గా ఉంచాడని ఫిలింనగర్ టాక్. తన టెస్ట్ రిజల్ట్ వచ్చిన వెంటనే తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలకు సైతం దగ్గరుండి టెస్ట్ చేయించినట్టుగా సమాచారం. అయితే వారికి కూడా నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చకున్నారని తెలుస్తోంది.
తాజాగా పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని చిన్న చితకా గ్యాప్ మినహా పెద్ద పెద్ద విరామాలేమీ లేకుండా పరుశురామ్ షూటింగ్‌ను కానిచ్చేస్తున్నారు. తాజాగా మహేష్ డ్రైవర్‌కు పాజిటివ్ అని తేలడంతో ఎందుకైనా మంచిదని ఆయన ఈ సినిమా షూటింగ్‌కు రెండు రోజుల పాటు గ్యాప్ ఇచ్చినట్టు సమాచారం. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com