సూపర్‌స్టార్ మహేశ్ సోదరుడు రమేశ్ బాబు కన్నుమూత

  • IndiaGlitz, [Saturday,January 08 2022]

టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మహేశ్‌ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌బాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

దీంతో కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేశ్‌బాబు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రమేశ్‌బాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రెండేళ్ల క్రితం కృష్ణ సతీమణి విజయ నిర్మల గుండెపోటుతో మరణించారు. తాజాగా రమేశ్ మరణంతో సూపర్‌స్టార్ కుప్పకూలిపోయారు.