అదే పేరుతో మరోసారి మహేష్ బాబు
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు స్థాయిని అమాంతంగా పెంచేసిన చిత్రం 'పోకిరి'. 2006లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించడమే కాకుండా.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం పతాక సన్నివేశాల్లో కృష్ణ మనోహర్‌గా సందడి చేశారు మహేష్. ఆ సినిమాకి ముందు, తరువాత మహేష్ నటించిన చిత్రాల్లో కృష్ణ అనే పాత్ర పేరు మరెక్కడా వినిపించలేదు. మళ్ళీ 12 ఏళ్ళ తరువాత అదే పేరుతో మహేష్ నటించనున్నారని తెలుస్తోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ పాత్ర పేరు కృష్ణ అని తెలిసింది. తన తండ్రి కృష్ణ పేరుని తొలిసారిగా పెట్టుకున్న పోకిరి ఘనవిజయం సాధించినట్లే.. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందేమో చూడాలి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా సందడి చేయనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com