బాలీవుడ్ యాక్ట‌ర్‌తో మ‌హేశ్‌...

  • IndiaGlitz, [Sunday,July 29 2018]

త్వ‌ర‌లోనే సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌.. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌వీర్ సింగ్‌తో క‌లిసి న‌టించ‌బోతున్నారు. అయితే సినిమాలో కాదు.. క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లో.

వివ‌రాల్లోకెళ్తే.. మ‌హేశ్, ర‌ణ‌వీర్ ఇద్ద‌రూ థ‌మ్స్ అప్ డ్రింక్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్స్‌గా ప‌నిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. థ‌మ్స్ అప్ తెలుగు క‌మ‌ర్షియ‌ల్‌లో మ‌హేశ్ న‌టిస్తే.. హిందీ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లో ర‌ణ‌వీర్ న‌టిస్తున్నాడు.

వీరిద్దరితో క‌లిసి ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌ను థ‌మ్స్ అప్ సంస్థ చేస్తుంది. దీని వ‌ల్ల అంద‌రిలో ఓ అటెన్ష‌న్ క్రియేట్ చేయ‌వ‌చ్చునని సంస్థ బావిస్తుంది.