సొంత థియేటర్‌లో ఫస్ట్ సినిమా చూసిన సూపర్‌స్టార్

  • IndiaGlitz, [Monday,May 06 2019]

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'. మే-09న సినిమా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీబిజీగా ఉంది. మహేశ్ బాబు కూడా మీడియాకు పర్సనల్‌, కామన్ ఇంటర్వ్యూలు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే కాసింత రిలీఫ్ అయిన మహేశ్ తన ఏఎంబీ సినిమాస్‌కు వెళ్లి ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ చిత్రం చూశారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు సూపర్‌స్టార్.

అవెంజర్స్ అద్భుతం...

'అవెంజర్స్ ఎండ్‌గేమ్' చిత్రం చూశా చాలా బాగుంది.. నాకు నచ్చింది.. చాలా ఎంజాయ్ చేశాను. ఏఎంబీ సినిమాస్‌లో మొదటిసారిగా సినిమా చూశా. ఏఎంబీ టీమ్‌కు ధన్యవాదాలు.. మీ పనితీరు అద్భుతం అని సిబ్బందిపై మహేశ్ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు ఏఎంబీ సిబ్బందితో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ ద్వారా సూపర్‌స్టార్ షేర్ చేశారు. కాగా సినిమా చూద్దామని టికెట్లు అడిగితే లేవని చెబుతున్నారని.. రెండు రోజుల్లో 'అవెంజర్స్' సినిమా చూస్తానని మహేశ్ ఇటీవల ఇంటర్వ్యూలో మీడియా మిత్రులతో సరదాగా అన్నారు. ఆదివారం సాయంత్రం తన ఏఎంబీలో అవెంజర్స్ సినిమా చూశారు.

క్యూ కడుతున్నారు!

ఇదిలా ఉంటే.. 'అవెంజర్స్ ఎండ్ గేమ్' మూవీకి రాజకీయ, సినీ సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. కాగా ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కలిసి ఏఎంబీ సినిమాస్‌లో అవెంజర్స్ చిత్రం వీక్షించారు. కాగా ఆదివారం సాయంత్రం వీక్షించగా. నేడు తన సొంత థియేటర్ (ఏఎంబీ)లో అవేంజర్స్ ఎండ్ గేమ్ చిత్రాన్ని మహేష్ తిలకించారు. మహేశ్ ట్వీట్ చూసిన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే సూపర్‌స్టార్ ట్వీట్‌‌కు అవెంజర్స్ చిత్రబృందం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.