Mahesh Babu: అభిమానులతో కలిసి 'గుంటూరు కారం' మూవీ చూసిన మహేష్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. బాబు యాక్టింగ్‌తో పాటు డ్యాన్స్‌లు ఇరగదీశాడంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం మిన్నంటింది. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి ఒంటి గంటకే బెనిఫిట్ షోలు పడటంతో పండుగ వాతావరణం నెలకొంది. విజయవాడలో అయితే మహేష్ కటౌట్లకు కొబ్బరికాయలు కొట్టి, పాలాభిషేకం చేస్తూ, డ్యాన్స్‌లు వేస్తూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఇక లేడీ ఫ్యాన్స్ డ్యాన్స్‌లు వేస్తూ తెగ హంగామా చేశారు. ఏ ఊరు చూసినా అన్ని థియేటర్ల దగ్గర మహేష్ అభిమానుల రచ్చ కనిపిస్తోంది.
మరోవైపు మహేష్.. తన ఫ్యామిలీతో కలిసి అభిమానుల మధ్య సినిమాను చూశారు. హైదరాబాద్‌లో తన ఫేవరెట్ థియేటరైన సుదర్శన్‌కు భార్య నమ్రత, ఇతర కుటుంబసభ్యులో కలిసి విచ్చేశారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధాలు లేకుండా పోయాయి. 'జై బాబు.. జైజై బాబు'.. 'మహేష్ అన్న' అంటూ థియేటర్ మొత్తం అరుపులతో దద్దరిల్లింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక మూవీ టాక్ విషయానికొస్తే మహేష్ యాక్టింగ్, డ్యాన్స్ అదిరిపోయాయి అని అంటున్నారు. శ్రీలల గ్లామర్, డ్యాన్స్ కూడా మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయని చెబుతున్నారు. త్రివిక్రమ్ డైలాగులు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. అయితే గత సినిమాల్లో ఉండే త్రివిక్రమ్ మార్క్ ఎక్కడో మిస్ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక చివర్లో తల్లీ కొడుకుల సెంటిమెంట్ కూడా బాగా వర్కవుట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదని.. ఇంకాస్త హై ఇచ్చి ఉంటే మాత్రం బాగుండేదనే అభిప్రాయం వినిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే మహేష్ ఖాతాలో మరో హిట్ పడినట్లే. మరి బ్లాక్‌బాస్టర్ హిట్ అవుతుందో లేక నార్మల్ హిట్‌గా మిగిలి పోతుందో కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం. ఇందుకోసం భారీ డీల్ కుదుర్చుకుందని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com