స్పీడు పెంచ‌మంటున్న మ‌హేశ్‌..!

  • IndiaGlitz, [Monday,September 28 2020]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్..ఈ ఏడాది స‌ర్కారువారి పాట‌తో సూప‌ర్‌హిట్ అందుకున్నారు. త‌న 27వ చిత్రం స‌ర్కారువారి పాట సినిమాకు సంబంధించిన షూటింగ్‌కు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కోవిడ్ ప్ర‌భావంతో పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ స్టార్ట్ కానే లేదు. అయితే అంద‌రూ క్ర‌మంగా షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్న నేప‌థ్యంలో మ‌హేశ్ అండ్ టీమ్ కూడా షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని అనుకుంటున్నారు.

క‌థానుగుణంగా షూటింగ్‌ను అమెరికాలో చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ ప‌రుశురాం అండ్ టీమ్ లొకేష‌న్స్ వేట కూడా పూర్తి చేసేశార‌ట‌. ఈ సినిమా షూటింగ్ విష‌యంలో మ‌హేశ్ ఎక్కువ గ్యాప్ తీసుకోవాల‌నుకోవ‌డం లేద‌ట‌. ఇప్ప‌టికే చాలా గ్యాప్ తీసుకున్నామ‌ని భావిస్తున్న మ‌హేశ్ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయ‌మంటున్నాడ‌ట. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేలా చూడ‌మని మ‌హేశ్ చెబుతున్న‌ట్లు టాక్‌. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు నిర్మించ‌నున్నాయి.