తనతో పాటు చిరంజీవిని తీసుకెళ‌తానంటున్న మ‌హేశ్‌

ఇప్పుడు హీరోల మ‌ధ్య ట్రెండ్ మారుతుంది. ఒక‌రికొక‌రు ప‌ర‌స్ప‌రం స‌హ‌కారం అందించుకుంటూ వ‌స్తున్నారు. స్నేహితుల్లాగా క‌లిసి పోతున్న ఈ హీరోల్లో మ‌హేశ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ముందుంటున్నారు. ఒక‌రి సినిమాల‌ను మ‌రొక‌రు అభినందించుకోవ‌డ‌మే కాదు.. ఒక‌రి వేడుక‌ల‌కు మ‌రొక‌రు హాజ‌ర‌వుతున్నారు. కాగా మ‌హేశ్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త‌మ హీరోల మ‌ధ్య ఉండే అనుబంధం గురించి ఇన్‌డైరెక్ట‌ర్‌గా చెప్పిన ఓ విష‌యం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

వివ‌రాల్లోకెళ్తే.. మీ బ‌యోపిక్ చేస్తే మీ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తే బావుంటుంద‌ని అనుకుంటున్నార‌ని మ‌హేశ్‌ని ప్ర‌శ్నించారు. అయితే మ‌హేశ్ ఏమాత్రం త‌డుముకోకుండా నా బ‌యోపిక్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌దు. నాది సింపుల్‌, బోరింగ్ లైఫ్‌. పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాదు అని చెప్పేశాడు. అలాగే రోడ్ ట్రిప్‌కు వెళితే సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రితో వెళ‌తార‌ని అడిగితే ...రామ్‌చ‌ర‌ణ్‌, తారక్‌ల‌ను తీసుకెళ‌తాన‌ని, అలాగే బ్యాలెన్స్ చేయ‌డానికి చిరంజీవిగారిని తీసుకెళ‌తాన‌ని స‌మాధానం చెప్పారు. త‌న‌కు తండ్రి కృష్ణ న‌టించిన అల్లూరి సీతారామరాజు సినిమా చూసిన త‌ర్వాతే న‌టుడు కావాల‌నే ఆస‌క్తి పుట్టింద‌ని కూడా ఈ సంద‌ర్భంగా మ‌హేశ్ చెప్పుకొచ్చారు.

ఈ ఏడాది సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రుతో హిట్ కొట్టిన మ‌హేశ్‌.. మే నెల‌లో వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మాణంలో త‌న 27వ సినిమాను షురూ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. 

More News

ప‌వ‌న్‌తో త్రివిక్ర‌మ్‌..?

జ‌న‌సేనాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామ్‌గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ రీ ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాదు..

విక్ట‌రీతో చ‌ర‌ణ్ చిత్రం..!!

సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన వెంక‌టేశ్‌తో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సినిమా చేయ‌బోతున్నాడా? అంటే అవున‌నే సమాధానం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుండి వ‌స్తుంది.

'ఆర్ఆర్ఆర్` నుండి చెర్రీ, ఆలియా లుక్స్ లీక్స్..?

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’. డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను ‘బాహుబ‌లి’

నిర్మాత డి.సురేష్ బాబు చేతుల మీదుగా 'పోస్టర్' సినిమా టిజర్ లాంచ్

ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ ఎంతో ఫేమస్. అందులో ఎన్నో సినిమాలు వంద రోజులు ఆడాయి.

నన్ను నలభై ఏళ్లు వెనక్కి పంపింది - ‘శంకరాభరణం’ చూసి స్పందించిన విశ్వనాధ్‌

జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మొట్ట మొదటి తెలుగు సినిమా ‘శంకరాభరణం’ విడుదలై 40 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా బాపురమణ అకాడమీ ఆధ్వర్యంలో ప్రసాద్‌ ల్యాబ్‌లో