మహేష్ వెర్షెస్ అల్లు అర్జున్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో ఏప్రిల్ 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం సరైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని కూడా ఏప్రిల్ 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుండడం విశేషం. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అదే రోజు సరైనోడు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
మరి..మహేష్, అల్లు అర్జున్...ఒకేరోజు సినిమాలు రిలీజ్ చేస్తారో...? లేక రిలీజ్ డేట్ మార్చుకుంటారో..చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments