మహేష్ వెరైటీ టైటిల్....?
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే సూపర్‌స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ పెరుగుతూ వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన వార్త ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంది. మొన్నటికి మొన్న మహేష్ మూవీని కొరటాల మల్టీస్టారర్ అనే వార్త జోరుగా వినపడటంతో కొరటాల ట్విట్టర్లో అలాంటిదేం లేదని సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు భరత్ అను నేను...అనేదే ఈ సినిమా టైటిల్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ పొలిటికల్ లీడర్‌గా కనపడనున్నాడని అందుకే ఈ టైటిల్ పెట్టారని కూడా టాక్ చక్కర్లు కొడుతుంది. దీనిపై కొరటాల శివ ఏమంటాడో చూడాలి.
మహేష్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు వందకోట్లను కలెక్ట్ చేసి సెన్సేషనల్ విజయాన్ని సాధించింది. మరోసారి ఈ హిట్ కాంబినేషన్ జత కావడంతో సినిమాపై ఆటోమెటిక్‌గా అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహేష్, మురగదాస్ సినిమా తన పార్ట్ పూర్తి కాగానే కొరటాల సినిమా స్టార్టవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments