అమెరికాకు మహేష్.. 45 రోజులు అక్కడే..

  • IndiaGlitz, [Monday,October 05 2020]

కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన చిత్ర పరిశ్రమ.. కేంద్రం షూటింగ్‌లకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు... థియేటర్లకు సైతం అనుమతినివ్వడంతో శరవేగంగా షూటింగ్‌లు జరుపుకుంటోంది. ఒకటి అర సినిమాలు తప్ప దాదాపు అన్ని సినిమాలూ షూటింగ్‌ను ప్రారంభించుకుంటున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం కూడా సిద్ధమవుతోంది. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం చిత్రబృందమంతా అమెరికా వెళ్లనుంది.

ఈ షెడ్యూల్ 45 రోజల పాటు కొనసాగనుంది. మహేష్‌తో పాటు ప్రధాన తారాగణమంతా అమెరికాకు వెళ్లనుంది. అమెరికాలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను దర్శకుడు పరుశురాం తెరకెక్కించనున్నారు. బ్యాంకింగ్ రంగంలో మోసాలు, కుట్రల నేపథ్యంలో ఈ చిత్రాన్ని పరుశురామ్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. అమెరికాలో 45 రోజుల షూటింగ్ నిర్వహించిన అనంతరం ‘సర్కారు వారి పాట’ చిత్ర యూనిట్ మళ్లీ జనవరిలో ఇండియాకి తిరిగొస్తారని తెలుస్తోంది. చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ను నిర్మిస్తున్నాయి. అయితే తొలుత ఈ చిత్రానికి పీఎస్‌ వినోద్‌ను ఛాయాగ్రాహకుడిగా తీసుకున్నారు. ఆయన ‘వకీల్‌ సాబ్‌’ చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉండటంతో డేట్స్‌ అడ్జస్ట్‌ చేయడం కుదరడం లేదని సమాచారం. దీంతో మరో ఛాయాగ్రాహకుడు మదిని తీసుకున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది విజయదశమికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

More News

‘తలైవి’ షూటింగ్‌లో కంగన.. చాలా ఓదార్పునిచ్చే సెట్ అంటూ ట్వీట్..

వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.

బుడ్డోడి డ్యాన్స్‌కు కేటీఆర్ ఫిదా.. నెటిజన్లు ఫైర్..!

సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకుల్లో మంత్రి కేటీఆర్ ఒకరు.

ప్రభాస్‌తో పెళ్లి పిక్‌పై క్లారిటీ ఇచ్చిన అనుష్క..

ప్రభాస్, అనుష్కల రిలేషన్‌షిప్ గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని వారిద్దరూ చెప్పినప్పటికీ ఊహాగానాలు మాత్రం ఆగలేదు.

పవన్‌కు జెడ్ కేటగిరి భద్రత అంటూ న్యూస్ వైరల్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రతను కల్పించిందంటూ ఓ న్యూస్ ఆదివారం తెగ వైరల్ అయింది.

జంబలకిడి పంబ అదుర్స్.. అందరూ సేఫ్..

స్వాతి నిన్న ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.