ఫ్యామిలీతో అమెరికా బయలుదేరిన మహేశ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఈరోజు ఉదయం సూపర్‌స్టార్ మహేశ్ తన కుటుంబం(నమ్రత, గౌతమ్, సితార) సహా అమెరికా బయలుదేరారు. ఎయిర్‌పోర్టులో మహేశ్ ఫ్యామిలీతో ఉన్న ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మహేశ్‌కు ఏమాత్రం ఖాళీ ఉన్నా కుటుంబానికి తన పూర్తి సమయాన్ని కేటాయిస్తారు. అది ఆయన ఫ్యామిలీకి ఇచ్చే ప్రాధాన్యత. వీలున్నప్పుడల్లా కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళుతుంటారు. కొవిడ్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన మహేశ్ ఇటీవల కొన్నియాడ్ షూటింగ్స్ కోసం బయటకు వచ్చారు. ఈ షూటింగ్స గట్రా పూర్తయిన తర్వాత మహేశ్ అమెరికా ఫ్లైట్ ఎక్కేశారు.
మహేశ్ 27వ చిత్రం 'సర్కారువారిపాట' యూనిట్ రెగ్యులర్ షూటింగ్‌కు సన్నద్ధం అవుతోంది. తొలి షెడ్యూల్‌ను అమెరికాలో చిత్రీకరించబోతున్నారు. సినిమాలో 40 శాతం చిత్రీకరణ అమెరికాలోనే జరగనుందట. అందుకోసం 45 రోజుల పాటు షెడ్యూల్ ప్లానింగ్ రెడీ అయ్యింది. జనవరి నుండి యూనిట్ అమెరికా వెళుతుందని వార్తలు కూడా వినిపించాయి. కానీ యూనిట్ కంటే ముందుగానే మహేశ్ అమెరికా బయలుదేరేశాడు. దాదాపు రెండు నెలల సమయం ఉంది. అంత వరకు మహేశ్ అమెరికాలో ఉండబోతున్నాడు. క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ వేడుకలను మహేశ్ అమెరికాలోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నాడని క్లియర్‌గా అర్థమవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout