అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది: మహేష్ బాబు

  • IndiaGlitz, [Tuesday,April 07 2020]

ఈరోజు వ‌ర‌ల్డ్ హెల్త్ డే.. ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు గ‌జ‌గ‌జ వ‌ణుకుతోంది. ఈ మ‌హ‌మ్మారిని త‌రిమేయ‌డానికి దేశ‌మంతా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను విధించారు. అయితే ఈలోపు ప్ర‌పంచంలోని ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడ‌టానికి డాక్ట‌ర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు అహ‌ర్నిశ‌లు శ్ర‌మ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌ర‌ల్డ్ హెల్త్ డే సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశిస్తూ ట్వీట్స్ చేశాడు.

‘‘రెండు వారాల లాక్‌డౌన్ పూర్త‌య్యింది. మ‌నం విజ‌య‌వంతంగా పూర్తి చేశాం. మ‌నం చాలా బ‌లంగా ఉన్నాం. మ‌న ప్ర‌భుత్వాలు సంయుక్తంగా తీసుకున్న నిర్ణ‌యాల‌ను అభినందిస్తున్నాను. ఈ వ‌రల్డ్ హెల్త్ డే సంద‌ర్భంగా క‌రోనా వైర‌స్‌పై పోరాటానికి ముందుండి పోరాడుతున్న డాక్ట‌ర్స్‌కు అభినంద‌న‌లు. సామాజికి దూరం పాటించ‌డం ఎంత ముఖ్య‌మో మ‌రో విష‌యంలో కూడా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం అంతే ముఖ్యం. ఫేక్ న్యూస్‌ను క్రియేట్ చేస్తున్న వ్య‌క్తుల‌కు దూరంగా ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా సూచిస్తున్నాను. ఇలా మ‌నల్ని మిస్ గైడ్ చేసే వ్య‌క్తుల‌కు దూరంగా ఉండ‌టం మంచిదే’’ అన్నారు.

More News

బన్నీ కొత్త సినిమా టైటిల్ ఇదేనా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల‌లో షూటింగ్ ప్రారంభం కావాల్సింది. అయితే కాలేదు.

భారత్ పెద్ద మనసు: ఎట్టకేలకు అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్..

అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్ (యాంటీ-మలేరియా) ఔషధం ఎగుమతి విషయంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కొవిడ్-19పై సమాచారం కోసం వాట్సాప్ చాట్ బోట్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భూతంపై పోరాటంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గే అవకాశం..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 నివారణా చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన

మేం అడిగితే ఇవ్వరా.. భారత్‌పై ప్రతీకారం ఉండొచ్చు: ట్రంప్

కరోనా వైరస్‌పై పోరాటంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కాస్త వర్కవుట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇండియాలో మెండుగా ఉంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి..