అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది: మహేష్ బాబు
Send us your feedback to audioarticles@vaarta.com
ఈరోజు వరల్డ్ హెల్త్ డే.. ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకు గజగజ వణుకుతోంది. ఈ మహమ్మారిని తరిమేయడానికి దేశమంతా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను విధించారు. అయితే ఈలోపు ప్రపంచంలోని ప్రజల ప్రాణాలను కాపాడటానికి డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు అహర్నిశలు శ్రమపడుతున్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్ హెల్త్ డే సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్ ప్రజలను ఉద్దేశిస్తూ ట్వీట్స్ చేశాడు.
‘‘రెండు వారాల లాక్‌డౌన్ పూర్తయ్యింది. మనం విజయవంతంగా పూర్తి చేశాం. మనం చాలా బలంగా ఉన్నాం. మన ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయాలను అభినందిస్తున్నాను. ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా కరోనా వైరస్‌పై పోరాటానికి ముందుండి పోరాడుతున్న డాక్టర్స్‌కు అభినందనలు. సామాజికి దూరం పాటించడం ఎంత ముఖ్యమో మరో విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం అంతే ముఖ్యం. ఫేక్ న్యూస్‌ను క్రియేట్ చేస్తున్న వ్యక్తులకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా సూచిస్తున్నాను. ఇలా మనల్ని మిస్ గైడ్ చేసే వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిదే’’ అన్నారు.
Two weeks of lockdown and we have been going strong. Hugely appreciate the united efforts of our governments???????????? This #WorldHealthDay, let's take a moment to thank all those on the frontline of our battle against COVID-19 who ensure we remain in good health.
— Mahesh Babu (@urstrulyMahesh) April 7, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments