వెబ్‌సిరీస్ నిర్మాణంలోకి మహేష్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోగానే కాకుండా `శ్రీమంతుడు` సినిమాతో ఎం.బి.ఎంటర్‌ైటెన్‌మెంట్స్ అనే నిర్మాణ సంస్థను కూడా స్టార్ట్ చేసిన మహేశ్ ఆ తదుపరి మరే సినిమాలో నిర్మాణ భాగస్వామిగా మారలేదు. అయితే ఇప్పుడు ఆయన కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయుడానికి తన బ్యానర్లో చిన్న సినిమాలను నిర్మించాలనుకుంటున్నారని వార్తలు వినపడ్డాయి.
తాజాగా ఓ ప్రముఖ డిజిటల్ సంస్థతో కలిసి ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించబోతున్నారనేది సమాచారం. హుస్సేన్ అనే కొత్త దర్శకుడితో కలిసి ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించనున్నారు మహేశ్. ఈ వెబ్ సిరీస్ జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం.
ఇటీవల ఎ.ఎం.బి.సినిమా ద్వారా థియేటర్స్ బిజినెస్‌లోకి అడుగు పెట్టిన మహేశ్ నిర్మాణ రంగంలోకి పూర్తిస్థాయిలో ఎంట్రీ ఇచ్చేలా కనపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments