వెబ్‌సిరీస్ నిర్మాణంలోకి మ‌హేష్‌

  • IndiaGlitz, [Sunday,December 23 2018]

హీరోగానే కాకుండా 'శ్రీమంతుడు' సినిమాతో ఎం.బి.ఎంటర్‌ైటెన్‌మెంట్స్ అనే నిర్మాణ సంస్థను కూడా స్టార్ట్ చేసిన మహేశ్ ఆ తదుపరి మరే సినిమాలో నిర్మాణ భాగస్వామిగా మారలేదు. అయితే ఇప్పుడు ఆయన కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయుడానికి తన బ్యానర్‌లో చిన్న సినిమాలను నిర్మించాలనుకుంటున్నారని వార్తలు వినపడ్డాయి.

తాజాగా ఓ ప్రముఖ డిజిటల్ సంస్థతో కలిసి ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించబోతున్నారనేది సమాచారం. హుస్సేన్ అనే కొత్త దర్శకుడితో కలిసి ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించనున్నారు మహేశ్. ఈ వెబ్ సిరీస్ జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం.

ఇటీవల ఎ.ఎం.బి.సినిమా ద్వారా థియేటర్స్ బిజినెస్‌లోకి అడుగు పెట్టిన మహేశ్ నిర్మాణ రంగంలోకి పూర్తిస్థాయిలో ఎంట్రీ ఇచ్చేలా కనపడుతున్నారు.

More News

టికెట్ ధ‌ర‌పై త‌గ్గిన జి.ఎస్‌.టి

కేంద్ర ప్ర‌భుత్వం 18 శాతం జి.ఎస్‌.టి ప‌న్ను విధించిన‌ప్పుడు సినిమా రంగ పరిశ్ర‌మ బెంబేలెత్తింది. ఎందుకంటే వంద రూపాయ‌ల కంటే ఎక్కువ‌గా ఉన్న టికెట్స్‌పై జి.ఎస్‌.టి 28 శాతం వ‌సూలు చేశారు. 

కార్ల వ్యాపారిగా ప్ర‌భాస్‌

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘సాహో’ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో యు.వి. క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

శోభన్‌బాబు అవార్డుల ప్రదానం వివరాలు

అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో శోభన్‌బాబు పేరుమీద పురస్కారాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుక డిసెంబర్ 25 సాయంత్రం 4 గంటల నుంచి హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తారు.

చిరంజీవి టైటిల్స్‌పైనే క‌న్నేశాడే!

న‌కిలీ, డా.స‌లీమ్ చిత్రాల స‌క్సెస్‌ల‌తో ప‌రావాలేదు అనిపించుకున్న విజ‌య్ ఆంటోని బిచ్చ‌గాడుతో మాత్రం సెన్సేష‌న‌ల్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. త‌ర్వాత విడుద‌లైన ..

12 రీమిక్స్‌ల్లో బాల‌య్య‌

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ.. ఎన్‌.బి.కె.ఫిలింస్ ప‌తాకంపై నిర్మిస్తున్న చిత్రం `య‌న్‌.టి.ఆర్‌`. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆధారంగా చిత్రం రెండు భాగాలుగా ...