మహేశ్ - త్రివిక్రమ్ మూవీ : పూజా కార్యక్రమాల కోసం సిద్ధమవుతున్న ‘‘ SSMB28 ’’

కోవిడ్ కేసుల తీవ్రత తగ్గడంతో ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ కోలుకుంటోంది. త్వరలో పెద్ద సినిమాల జాతర వుంటుందని స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఇప్పటికే ప్రకటించారు. అలాగే సినిమాల షూటింగ్‌లకు కూడా టాలీవుడ్ రెడీ అవుతోంది. గత కొన్నిరోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్టీఆర్- కొరటాల శివ సినిమా ఫిబ్రవరిలో పట్టాలెక్కుతుందని ఫిలింనగర్‌లో ఓ వార్త వైరల్ అవుతోంది. తాజాగా త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్‌లోనూ సినిమా సెట్ అయిన సంగతి తెలిసిందే. ఈపాటికే పూజా కార్యక్రమాలు జరుపుకోవాల్సిన ఈ సినిమా .. మహేశ్ ప్రస్తుతం మోకాలు సర్జరీ చేయించుకుని రెస్ట్‌లో వుండటం, కోవిడ్ వంటి కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.

అయితే ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయ్యిందని ఫిలింనగర్ టాక్. ఫిబ్రవరి 3న పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. హైద‌రాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా మహేష్ బాబు తన సినిమా ఓపెనింగ్‌ల‌కు రారు.. కెరీర్ ప్రారంభం నుంచి ఆయనకు అదొక సెంటిమెంట్‌గా వస్తోంది. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా ప్రారంభోత్సవానికి కూడా సూపర్‌స్టార్ రావడం లేదని సమాచారం. అయితే... మహేశ్‌కు బదులు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అటెండ్ కానున్నారట.

గతేడాది సరిలేరు నీకెవ్వరుతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిపాటి షూటింగ్ మిగిలివున్నట్లుగా తెలుస్తోంది. మహేశ్ కోలుకున్నాక.. మిగిలిన భాగం కంప్లీట్ చేసి సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇకపోతే.. ‘‘అతడు’’, ఖలేజా తర్వాత దాదాపు 12 ఏళ్లకు మహేష్ -త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రానుండటంతో పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. SSMB28ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.

More News

మనం పెట్టిందే చట్టం.. పోసేదే మద్యం : చియాన్ విక్రమ్ ‘‘మహాన్’’ టీజర్ అదిరిందిగా

విలక్షణ  నటుడు విక్రమ్‌కు తమిళంలో ఎంత పాపులారిటీ వుందో.. తెలుగులోనూ అంతే. రెండున్నర దశాబ్ధాల క్రితమే ఆయన స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో నటించారు.

‘‘శేఖర్‌’’లో అర్మాన్ మాలిక్‌తో మెలోడీ సాంగ్.. రెండ్రోజుల్లో రికార్డింగ్, రాజశేఖర్ బర్త్‌డేకి రిలీజ్

ఇప్పుడు దేశంలో పాన్ ఇండియా సినిమా కల్చర్ ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే.

NTR 30: ఫిబ్రవరిలో సెట్స్‌పైకి ఎన్టీఆర్-కొరటాల మూవీ, ముహూర్తం ఫిక్స్.. కథ ఇదేనా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను అభిమానులు స్క్రీన్ మీద చూసుకుని దాదాపు మూడేళ్లు కావొస్తోంది. అప్పుడెప్పుడో త్రివిక్రమ్ దర్శకత్వంలో

కోవిడ్ నుంచి కోలుకున్న లతా మంగేష్కర్.. వెంటిలేటర్ తొలగింపు

దిగ్గజ నేపథ్య గాయనీ, భారతరత్న లతా మంగేష్కర్ (92) ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

‘ చింతామణి ’ నాటకంపై నిషేధం.. ఏపీ ప్రభుత్వంపై కోర్టుకెక్కిన ఎంపీ రఘురామ

దశాబ్ధాలుగా తెలుగువారిని అలరిస్తున్న ‘‘చింతామణి’’ నాటకంపై ఇటీవల ఏపీ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.