మ‌హేష్ - త్రివిక్ర‌మ్ సినిమా ఎప్పుడు..?

  • IndiaGlitz, [Friday,December 16 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో అత‌డు, ఖ‌లేజా చిత్రాలు రూపొందిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో మూడ‌వ చిత్రం రానుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ...ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. అయితే...మ‌హేష్ ప్ర‌స్తుతం మురుగుదాస్ తో ఓ సినిమా చేస్తున్నారు.

ఈ మూవీ త‌ర్వాత మ‌హేష్ బాబు 24వ సినిమాను కొర‌టాల శివతో చేయ‌నున్నారు. దీంతో మ‌హేష్ 25వ సినిమా త్రివిక్ర‌మ్ తో ఉంటుందేమో అనుకున్నారు. కానీ...మ‌హేష్ 25వ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కత్వంలో చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మూవీ త‌ర్వాత త్రివిక్ర‌మ్ తో 2018 లో సినిమా ఉంటుంది అని తెలిసింది. ఈలోపు త్రివిక్ర‌మ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఓ మూవీ, యంగ్ టైగ‌ర్ తో మ‌రో మూవీ చేయ‌నున్నారు. 2018లో మ‌హేష్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందే భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించే అవ‌కాశం ఉంది