మరోసారి స్టూడెంట్‌గా మహేష్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్లో 25వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
'అల్లరి' నరేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. స్నేహాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందుతున్న ఈ మూవీలో కొన్ని సామాజిక అంశాలను కూడా దర్శకుడు టచ్ చేస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ నెల 10వ తేదీ నుంచి తొలి షెడ్యూల్‌ను డెహ్రాడున్లో చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. కాలేజీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను డెహ్రాడున్లో షూట్ చేస్తున్నట్టు చెబుతున్నారు.
అంటే.. 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా మహేష్ స్టూడెంట్‌గా మరోసారి అలరించనున్నారన్న మాట. అలాగే.. అమెరికా బ్యాక్ డ్రాప్లో సాగే ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారని కూడా ప్రచారం సాగుతోంది. మరి వీటిపై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com