ఫ్యాన్స్ కి మహేష్ చేయూత...

  • IndiaGlitz, [Wednesday,August 19 2015]

శ్రీమంతుడు' చిత్రం సక్సెస్ తో అభిమానుల నుండి బర్త్ డే గిఫ్ట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ తన ఫ్యాన్స్ కి అండగా నిలబడుతున్నాడు. ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మహేష్ కి కేక్ తీసుకొస్తున్న అభిమాని అభిషేక్ యాక్సిడెంట్ కి గురై మరణించాడు. ఈ సంగతి తెలుసుకున్న మహేష్ స్పందించి అతని కుటుంబానికి రెండున్నర లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించాడు. అంతే కాకుండా మరో ప్రమాదంలో గాయపడిన అభిమానికి లక్ష రూపాయలను గిఫ్ట్ గా అందించాడు. ఈ మొత్తాన్ని మహేష్ పర్సనల్ సెక్రటరీ వారికి అందజేశాడట..