క‌రోనాపై పోరుకు మ‌హేశ్ కొత్త ఆలోచ‌న‌..!!

కోవిడ్ 19 ప్ర‌భావంతో ప్ర‌పంచం ఎక్క‌డిక‌క్క‌డే ఆగిపోయింది. అన్నీ రంగాలు స్తబ్దుగా అయిపోవడం అభివృద్ధి ఆగిపోయింది. ఉన్న‌త, మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం వ‌ల్ల పెద్ద‌గా ఇబ్బందులు లేదు. అయితే రోజువారీ కూలీలు మాత్రం తెగ ఇబ్బంది ప‌డుతున్నారు. రోజువారీ ప‌నులు లేక‌పోవ‌డంతో వారు, వారి కుటుంబం స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నాయి. దీంతో పలువురు సెల‌బ్రిటీలు త‌మ‌కు తోచినంత‌గా కార్మికుల‌కు, పేద‌ల‌కు సాయం చేస్తున్నారు.

సినిమా రంగంలో ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, స్టార్స్ అంద‌రూ త‌మ వంతు సాయాన్ని అందిస్తున్నారు. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ విష‌యానికి వ‌స్తే క‌రోనా నివార‌ణా చ‌ర్య‌ల కోసం ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల‌కు కోటి రూపాయ‌లు విరాళం అందించారు. అంతే కాకుండా సినీ కార్మికుల కోసం పాతిక ల‌క్ష‌లు విరాళ‌మిచ్చారు. ఇప్పుడు పేద వారిని ఆదుకోవ‌డానికి మ‌హేశ్ మ‌రో కొత్త ఆలోచ‌న చేస్తున్నాడ‌ట‌. తెనాలి స‌మీప గ్రామాల్లో కొన్నింటిని ద‌త్త‌త తీసుకుని వాటిలో కూలీ లేకుండా ఇబ్బందులు ప‌డుతున్న‌వారికి డ‌బ్బుల‌ను, నిత్యావ‌స‌రాల వ‌స్తువుల‌ను అంద చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఆ దిశ‌గా గ‌ల్లా జ‌య‌దేవ్‌తో క‌లిసి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. ఒక‌వేళ ఇది నిజ‌మైతే నిజంగా మ‌హేశ్ స‌హృద‌యానికి సెల్యూట్ చేయాల్సిందే.

More News

నర్సింగ్‌ యాదవ్‌ పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ ఏపీలో పరీక్షలు

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్‌ ఆఫీసర్‌ నిర్ధారించిన వారినే కాకుండా... వైరస్‌ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించాలని

‘రేపట్నుంచి తెలంగాణలో కరోనా కేసులుండవేమో!’

రేపట్నుంచి అనగా శుక్రవారం నుంచి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఉండకపోవచ్చేమోనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

విపత్కర తరుణంలో రాజకీయాలొద్దు..: జనసేనాని

కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించడంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి అయిందని.. ఈ విపత్తులో పేద వర్గాలుపడుతున్న ఇబ్బందులను

హైదరాబాదీలను బెంబేలెత్తిస్తున్న కరోనా హాట్ స్పాట్స్..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనే జరగకపోయింటే పరిస్థితి ఈ పాటికే అదుపులోకి వచ్చేదేమో..! ఆ ఘటనతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది.