ఏఎంబీకి మించిన మల్టీఫ్లెక్స్‌ నిర్మించబోతున్న మహేశ్!

  • IndiaGlitz, [Saturday,January 25 2020]

హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం 7 స్క్ర్రీన్లతో, 1,600 సీటింగ్ కెపాసిటీతో ప్రారంభించారు. అంతేకాదు.. రూ. 230 నుంచి టికెట్ ధర ప్రారంభం అవుతుండటంతో ఈ థియేటర్‌కు భారీ ఆదరణ లభించింది. ఇప్పటికే అటు సినిమాలు.. ఇటు బిజినెస్‌ పరంగా బిజిబిజీగా ఉన్న మహేశ్ ఈ మల్టీఫ్లెక్స్ బిజినెస్‌ను మరింత పొడిగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మెట్రో సిటీ.. రద్దీగా, క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్‌లో మల్టిఫ్లెక్స్‌ను నిర్మించిన ఆయనకు.. బెంగళూరుపై కన్నుపడిందట. అందుకే.. బెంగళూరులో భారీ మల్టీఫ్లెక్స్‌ను నిర్మించబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమై మహేశ్ అభిమానుల్లో, టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. హైదరాబాద్‌లో తనపేరుతో మల్టీఫ్లెక్స్ ఉండటంతో బెంగళూరులో నిర్మించబోయే భారీ థియేటర్‌కు ఏ పేరు పెట్టాలనే దానిపై మహేశ్ తన సన్నిహితులు, ఆప్తులు, కుటుంబీకులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కుమార్తె, కుమారుడు ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా థియేటర్ పేరుండాలని అలాంటిది సూచించాలని మహేశ్ తన సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం. అయితే.. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.