తెలుగు మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ సిల్వర్ జూబ్లి వేడుకలకి ముఖ్యఅతిథిగా సూపర్‌స్టార్ మహేష్ బాబు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా 24 క్రాఫ్ట్స్ లో ముఖ్యమైన విభాగాల్లో తెలుగు మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఒకటి.. ఈ యూనియన్ ఈ సంవత్సంరం తో 25 సంవత్సరాలు పూర్తిచేసుకుంటుంది. ఈ సందర్బంగా యూనియన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరి మరియు ఈసి మెంబర్స్ అందరూ కలసి సిల్వర్ జూబ్లి ఫంక్షన్ ని కలిసికట్టుగా జూన్ 10 న గ్రాండ్ గా అన్నపూర్థా స్టూడియోలొ జరపనున్నారు.
ఈ కార్యక్రమానికి ఇటీవలే భరత్ అనే నేను లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తో తన స్టామినాని మరోక్కసారి బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేసిన సూపర్‌స్టార్ మహేష్ బాబు ముఖ్యఅతిధిగా విచ్చేస్తున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి ఇండస్ట్రిలో వున్న హీరోలు, దర్శకులు, నిర్మాతల తో పాటు 24 క్రాఫ్ట్స్ లో వున్న వారంతా హజరవుతారు. అయితే ఈ సందర్బంగా క్రేజి డైరక్టర్ కొరటాల శివ చేతుల మీదుగా ఈ ఫంక్షన్ కి సంబందించి కర్టన్ రైజర్ మరియు థీమ్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డబ్బింగ్ కళాకారిణి రోజా రమణి గారు, పప్పు గారు, చంద్రిక గారు, ప్రసాద్ గారు తదితర డబ్బింగ్ కళాకారులు హజరయ్యారు..
దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ... సినిమా ఇండస్ట్రిలొ కనిపంచకుండా నటించే అద్యత కళాకారులు మన డబ్బింగ్ కళాకారులు.. వారు లేకుంటే ఏ సినిమా ఇండస్ట్రి కూడా లేదు. నా చిన్నప్పుడు వీరి గురించి తెలియదు కాని కొన్ని రొజులకి సాయికుమార్ గారి వాయిస్, రొజా రమణి గారి వాయిస్ లు తెలుసు.. ఇండస్ట్రి కి వచ్చాక తెలిసింది వీరి విలువ. ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు చాలా ఆనందంగా వుంది. అయితే శబ్దాలయ లో పప్పు ఈ కార్యక్రమం గురించి గత సంవత్సర కాలంగా కష్టపడుతున్నాడు. ఆయన మహేష్ బాబు ని అడగమని చెప్పాడు. అడిగిన వెంటనే మహేష్ బాబు గారు వస్తాను అన్నారు. జూన్ 10 గ్రాండ్ చేస్తున్న సిల్వర్ జూబ్లి ఫంక్షన్ కి మహేష్ బాబు గారు వస్తున్నారు. అని అన్నారు
ప్రముఖ నటి, డబ్బింగ్ కథాకారిణి రొజా రమణి గారు మాట్లాడుతూ.. నా సిని జీవితం మెదలయ్యి ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి.. నా డబ్బింగ్ యూనియన్ స్టార్టయ్యి 25 సంవత్సారాలయ్యింది. ఇప్పడు ఇలా నా కుటుంబం అంతా కలసి 24 క్రాఫ్ట్ లో మెదటి గా సిల్వర్ జూబ్లి ఫంక్షన్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. ఈ కార్యక్రమానికి మా కృష్ణ గారి అబ్బాయి సూపర్‌స్టార్ మహేష్ బాబు ముఖ్యఅతిథిగా రావటం చాలా ఆనందం గా వుంది. అలాగే మా కర్టన్ రైజర్ లాంచ్ కి విచ్చేసిన కొరటాల శివ గారు చేయటం చాలా ఆనందంగా వుంది. ఈ కార్యక్రమాన్ని శ్రేయాస్ మీడియా వారు చేస్తున్నారు. మా పప్పు అందరిని కలుపుకుంటూ వెళ్ళి ఈ ఫంక్షన్ జూన్ 10 న గ్రాండ్ గా చేస్తున్నాడు.. అని అన్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments