మహేష్ ఆలోచన బాగుందే
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ తదుపరి సినిమాను అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. అనీల్ సుంకర్ నిర్మాత. ఈయనతో పాటు మహేష్ తన కొత్త నిర్మాణ సంస్థ జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ సినిమాలో భాగస్వామి అవుతున్న సంగతి తెలిసిందే.
వినపడుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు మహేష్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. ఆ స్థానంలో శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ మాత్రమే తీసుకున్నాడట. అయితే అనీల్ సుంకర్ నిర్మాణ వ్యయమంతా చూసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాను విడుదల చేయబోతున్నాడట.
దీనిలో వచ్చే లాభమే ఆయనకు మిగులుతుంది. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ 50 కోట్లు అయ్యేలా ఉందని సమాచారం. విషయం తెలిసిన వాళ్లు మహేష్ ఆలోచన బావుందే అని అనుకుంటున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout