థ్యాంక్స్ చెప్పిన శ్రీమంతుడు..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బష్టర్ శ్రీమంతుడు. ఈ చిత్రానికి గాను సైమా (సౌతిండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2016 సంవత్సరానికి ఉత్తమ నటుడుగా మహేష్ బాబు అవార్డు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ట్విట్టర్ లో స్పందిస్తూ...శ్రీమంతుడు చిత్రానికి గాను ఉత్తమనటుడుగా అవార్డు అందుకున్నాను థ్యాంక్యూ సైమా అంటూ ట్వీట్ చేసారు.
ఇటీవల సింగపూర్ లో సైమా అవార్డ్ ప్రదానోత్సవం జరిగింది. ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా ఉత్తమ నటుడు అవార్డ్ ఎంపిక జరిగింది. మహేష్ బాబు ఆన్ లైన్ ఓటింగ్ లో తొలి స్ధానంలో నిలిచి అవార్డు సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఐదు సైమా అవార్డ్స్ వేడుకలు జరగగా 2012లో దూకుడు, 2014లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఇప్పుడు శ్రీమంతుడు చిత్రంతో మహేష్ మూడుసార్లు ఉత్తమ నటుడుగా సైమా అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com