మహేశ్ బాబుకి కరోనా పాజిటివ్.. ఉలిక్కిపడ్డ టాలీవుడ్, కోలుకోవాలంటూ ఫ్యాన్స్ ట్వీట్లు
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో పరిస్థితులు మళ్లీ అదుపు తప్పుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా కరోనా, ఒమిక్రాన్ కేసులు ఊహకందని వేగంతో పెరుగుతున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం కోవిడ్ బారినపడుతున్నారు. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన వారికి పాజిటివ్‌గా తేలుతోంది. ఈ రోజు కోలీవుడ్‌కు చెందిన అరుణ్ విజయ్‌కి కరోనా సోకింది. ఆ తర్వాత కాసేటికే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు సైతం వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్నీ స్వయంగా మహేష్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డానని.. స్వల్ప లక్షణాలతో హోమ్ ఇసో లేషన్ లో ఉన్నానని సూపర్‌స్టార్ మహేశ్ తెలిపారు. అలాగే గత కొద్దీరోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్‌లు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరలోనే షూటింగ్లో పాల్గొనాలని ఎదురుచూస్తున్నానని ఆయన తెలిపారు. మరోవైపు మహేష్‌కు కరోనా అని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సూపర్‌స్టార్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అలాగే సీనియర్ నటుడు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి కూడా ఈరోజే కొవిడ్ బారిన పడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ విషయాన్ని తెలిపారు. బూచోడులాంటి కరోనా నుంచి రెండేళ్లుగా తప్పించుకున్నానని, చివరికి దాని బారిన పడ్డానని మంచు లక్ష్మీ వివరించారు. కొవిడ్ నుంచి త్వరగా బయటపడేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని మంచు లక్ష్మీ కోరారు.
వైరస్‌తో పోరాడేందుకు మన వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలని... మంచి ఆహారం తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ తీసుకోవాలని.. ఒకవేళ మీరు ఇప్పటికే రెండు సార్లు కొవిడ్ టీకా తీసుకునుంటే బూస్టర్ డోసు తీసుకోవాలని మంచు లక్ష్మీ చెప్పారు. వినోదం కోసం మంచి సినిమాలు, కార్యక్రమాలు, పాడ్కాస్ట్ల వివరాలు చెప్పాలంటూ అభిమానులను కోరారు.
— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2022
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com