మహేష్ మాటలతో షాక్ తిన్న వినాయక్..
- IndiaGlitz, [Friday,November 06 2015]
సూపర్ స్టార్ మహేష్ మాటలతో...సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ షాక్ తిన్నారు. ఈ విషయాన్ని స్వయంగా వినాయకే మీడియాకి తెలియచేసారు. ఇంతకీ విషయం ఏమిటంటే..అఖిల్ ఆడియో వేడుకకు మహేష్ ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో మహేష్ మాట్లాడుతూ..హీరోను ప్రెజెంట్ చేయడంలో వినాయక్ గారి తర్వాతే ఎవరైనా అన్నారు.
మహేష్ అలా స్పందించడం పై వినాయక్ ని అడిగితే..మహేష్ కి నా పై అంత అభిమానం ఉందా అనిపించింది. అసలు ఆయన అలా మాట్లాడతారని ఊహించలేదు. మహేష్ తో సినిమా చేస్తే..మామూలు సినిమా చేయను. 100 కోట్ల బడ్జెట్ తో భారీ సినిమా చేస్తాను. కథ రెడీ అయిన తర్వాత చర్చించి ఈ భారీ చిత్రాన్ని ప్రారంభిస్తాం అన్నారు. అది సంగతి.