బాహుబ‌లి రికార్డ్ ను క్రాస్ చేసిన మ‌హేష్ బాబు..!

  • IndiaGlitz, [Thursday,December 01 2016]

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. తెలుగులో రూపొందిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే.థియేట్రిక‌ల్ రెవెన్యూ ప‌రంగానే కాకుండా శాటిలైట్ రైట్స్ విష‌యంలోను బాహుబ‌లి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్ర‌ముఖ ఎంట‌ర్ టైన్మెంట్ ఛాన‌ల్ మా టీవీ 25 కోట్లు చెల్లించి బాహుబ‌లి శాటిలైట్ రైట్స్ ను ద‌క్కించుకుంది.

రెండు పార్ట్ ల‌కు క‌లిపి 25 కోట్లుకు అమ్ముడుపోవ‌డం ఓ రికార్డ్ గా నిలిచింది. ఇప్పుడు బాహుబ‌లి శాటిలైట్ రైట్స్ రికార్డ్ ను సూపర్ స్టార్ మ‌హేష్ క్రాస్ చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేయ‌డం విశేషం. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే....మ‌హేష్ మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న చిత్రం శాటిలైట్ రైట్స్ 26 కోట్ల‌కు అమ్ముడు పోయిన‌ట్లు స‌మాచారం. తెలుగు, త‌మిళ్, హిందీ ఈ మూడు భాష‌ల శాటిలైట్ రైట్స్ ను 26 కోట్లుకు అమ్మార‌ట‌. ఇదే క‌నుక నిజ‌మైతే...సినిమా రిలీజ్ కి ముందే బాహుబ‌లి రికార్డ్ ను క్రాస్ చేసి సూప‌ర్ స్టార్ మ‌హేష్ సంచ‌ల‌నం సృష్టించిన‌ట్టే..!