తండ్రిని వదిలి వెళ్లిన మహేష్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ కృష్ణ ఇప్పుడున్న కష్టాల్లో ఆయన్ని వదలాలని మహేష్‌కి లేదు. అయినా ముందు ఇచ్చిన కమిట్‌మెంట్స్ కారణంగా తండ్రి దూరంగా వెళ్లాడుమహేష్. ఇప్పుడు ఆయన నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ కాశ్మీర్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. గురువారం నుంచి ఈ సినిమా షెడ్యూల్‌లో రాజేంద్రప్రసాద్ కూడా పాల్గొంటున్నారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్ నటిస్తున్నారు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, టైటిల్ సాంగ్ కూడా అక్కడ చిత్రీకరించనున్నారు.
దిల్‌రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేష్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడం విశేషం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్ తో కలిసి జీఎంబీ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాల్గొంటోంది. రష్మిక మండన్న ఇందులో హీరోయిన్. నిన్నటి స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ కూడా ఈ సినిమా నుంచే మొదలవుతుంది. అనిల్ రావిపూడి ఎక్స్ ట్రార్డినరీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. అనిల్ రావిపూడికి రైటర్‌గా బ్రేక్ కూడా గతంలో మహేష్ సినిమాల ద్వారా వచ్చిందనేది గుర్తించాల్సిన విషయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com