తండ్రిని వ‌దిలి వెళ్లిన మ‌హేష్‌

  • IndiaGlitz, [Thursday,July 04 2019]

సూప‌ర్‌స్టార్ కృష్ణ ఇప్పుడున్న క‌ష్టాల్లో ఆయ‌న్ని వ‌ద‌లాల‌ని మ‌హేష్‌కి లేదు. అయినా ముందు ఇచ్చిన క‌మిట్‌మెంట్స్ కార‌ణంగా తండ్రి దూరంగా వెళ్లాడుమ‌హేష్‌. ఇప్పుడు ఆయ‌న న‌టిస్తున్న స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమా షూటింగ్ కాశ్మీర్‌లో జ‌రుగుతోంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడు. గురువారం నుంచి ఈ సినిమా షెడ్యూల్‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్ కూడా పాల్గొంటున్నారు. ఇందులో ఆర్మీ ఆఫీస‌ర్‌గా మ‌హేష్ న‌టిస్తున్నారు. కొన్ని కీల‌క స‌న్నివేశాల‌తో పాటు, టైటిల్ సాంగ్ కూడా అక్క‌డ చిత్రీక‌రించ‌నున్నారు.

దిల్‌రాజు, అనిల్ సుంక‌ర‌తో క‌లిసి మ‌హేష్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామి కావ‌డం విశేషం. శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్, ఏకే ఎంట‌ర్‌టైన్ మెంట్స్ తో క‌లిసి జీఎంబీ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాల్గొంటోంది. ర‌ష్మిక మండ‌న్న ఇందులో హీరోయిన్‌. నిన్న‌టి స్టార్ విజ‌య‌శాంతి రీ ఎంట్రీ కూడా ఈ సినిమా నుంచే మొద‌ల‌వుతుంది. అనిల్ రావిపూడి ఎక్స్ ట్రార్డిన‌రీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం. అనిల్ రావిపూడికి రైట‌ర్‌గా బ్రేక్ కూడా గ‌తంలో మ‌హేష్ సినిమాల ద్వారా వ‌చ్చింద‌నేది గుర్తించాల్సిన విష‌యం.

More News

హైద‌రాబాద్ లో ఐరాక్రియెష‌న్స్ షూటింగ్ కి చేరుకున్న నాగ‌శౌర్య‌

ఐరాక్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం 3 గా తెర‌కెక్కిస్తున్న చిత్రం షూటింగ్ వైజాగ్ లో జ‌రుగుతుండ‌గా హీరో నాగ‌శౌర్య

చిరంజీవి కొత్త అవ‌తారం

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.

మ‌రో విల‌క్షణ పాత్ర‌లో సామ్‌

నాగ‌చైత‌న్య‌తో పెళ్లి త‌ర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌పైనే పూర్తి ఫోక‌స్ పెట్టిన అక్కినేని స‌మంత‌. `యూట‌ర్న్` త‌ర్వాత `ఓ బేబీ` సినిమాలో న‌టించారు.

మాసివ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా  పారిజాత‌ మూవీ క్రియెష‌న్స్ చియాన్ విక్ర‌మ్ న‌టించిన 'మిస్ట‌ర్ కెకె'

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాల‌తో తెలుగు లో స్టార్ ఇమేజ్ ని సోంతం చేసుకున్న చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌హ‌స‌న్‌,

జూలై 12 న విడుదల కానున్న 'నేను లేను'..!!

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌ ప్రధాన పాత్రలుగా ఓ.య‌స్‌.యం విజన్ - దివ్యాషిక క్రియేష‌న్స్ పతాకాలపై సుక్రి  నిర్మిస్తున్న చిత్రం `నేను లేను`...