డిసెంబర్ నుంచి మహేష్, సుకుమార్ చిత్రం?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన '1 నేనొక్కడినే' కొత్త తరహా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ప్రస్తుతం సుకుమార్.. స్క్రిప్ట్‌కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనుందని తెలుస్తోంది. ఈ లోపు మహేష్.. వంశీ పైడి పల్లి దర్శకత్వంలో చేస్తున్న సినిమాని పూర్తిచేస్తారు. ఆ తరువాతే సుకుమార్ దర్శకత్వంలో సినిమాని పట్టాలెక్కిస్తారు.
క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో మహేష్ సి.ఐ.డి.ఆఫీసర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. 1 నేనొక్కడినే లాగే ఈ చిత్రం కూడా డిఫరెంట్‌గా ఉండొచ్చని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments