లీకైన మహేష్ బాబు ఫొటోలు
- IndiaGlitz, [Monday,July 08 2019]
మహేష్ తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' స్టిల్ లీకయ్యింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్‌లో జరుగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం కోసం ఇప్పటికే రాజేంద్రప్రసాద్ తదితరులు కాశ్మీర్‌కి చేరుకున్నారు. కాగా అక్కడ మిలిటరీ యూనిఫార్మ్ లో మహేష్ వర్కింగ్ స్టిల్స్ లీకయ్యాయి. మిలిటరీ డ్రస్సులో ఆర్మీ ఆఫీసర్‌గా ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలోనూ ఈ లుక్ ట్రెండ్ అవుతోంది. మహేష్ తో పాటు అందులో రాజేంద్రప్రసాద్ కూడా ఉన్నారు.
కాశ్మీర్ షెడ్యూల్ తర్వాత యూనిట్ మొత్తం హైదరాబాద్ చేరుకుంటుంది. ఇక్కడ ఓ ప్రత్యేకమైన రైల్లో కీలక ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తారు. దీనికోసం అన్నపూర్ణ ఏడెకరాలులో ఓ ప్రత్యేకమైన రైలు సెట్టు వేస్తున్నారట. ఈ చిత్రంతోనే విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుకానుంది. ఈ చిత్రానికి అనిల్ సుంకర, దిల్‌రాజు, మహేష్ నిర్మాతలు. నిర్మాణ పనులను మహేష్ సతీమణి నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నట్టు సమాచారం. రష్మిక మండన్న నాయికగా నటిస్తున్నారు. ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని ఇప్పటికే మహేష్ తెలిపారు. ఈ ఏడాది 'ఎఫ్2' హిట్టుతో ఆనందంగా ఉన్నారు అనిల్ రావిపూడి.