మహేష్ 'స్పైడర్ ' వాయిదా పడుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సినిమా అంటే ఎంతో క్రేజ్ క్రియేట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న `స్పైడర్` ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది. సినిమాను జూన్ 23న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఏమైందో ఏమో కానీ, ఇప్పుడు అదే తేదికి స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ `డిజె దువ్వాడ జగన్నాథమ్` సినిమాతో పాటు నాని `నిన్ను కోరి` సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు.
దీంతో మహేష్ స్పైడర్‌కు ఎమైందని ఊహాగానాలు మొదలైయ్యాయి. ముందు క్లైమాక్స్, రెండు సాంగ్స్ మినహా షూటింగ్ పూర్తని ప్రకటించారు. క్లైమాక్స్ చిత్రీకరణ పట్ల మహేష్ శాటిస్పాక్షన్‌గా లేడని, అందుకే ఆ సీన్స్‌ను రీ షూట్ చేస్తున్నారని అందుకే సినిమా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి స్పైడర్ విడుదల విషయంలో యూనిట్ ఇంకా ఏ విషయం చెప్పలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com