ఆ రోజుతో 'స్పైడర్' షూటింగ్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
మహేష్ బాబు, మురుగదాస్ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం స్పైడర్. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం రొమానియాలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడే ఈ సినిమాకి సంబంధించిన చివరి పాటను తెరకెక్కిస్తోంది చిత్ర బృందం. ఈ నెల 31తో ఈ పాట చిత్రీకరణ పూర్తవుతుంది. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లే.
అంటే.. మహేష్ తనయుడు గౌతమ్ పుట్టినరోజు నాటికి స్పైడర్ షూటింగ్ పూర్తవుతుందన్నమాట. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి హేరిస్ జైరాజ్ స్వరాలందిస్తున్నారు. సెప్టెంబర్ 27న దసరా కానుకగా స్పైడర్ రిలీజ్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com