మహేష్ మూవీ క్లైమాక్స్ కు ముహుర్తం కుదిరింది..

  • IndiaGlitz, [Tuesday,April 25 2017]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న స్పై థ్రిల్ల‌ర్ 'స్పైడ‌ర్‌'. సినిమాను ముందుగా జూన్ 23న విడుద‌ల చేయాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ అనివార్య కార‌ణాల‌తో సినిమా విడుద‌ల వాయిదా ప‌డిన‌ట్లు న్యూస్ వ‌స్తుంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మే 2న సినిమా క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ స్టార్ట్ అవుతుంది. మే నెలాఖ‌రు వ‌ర‌కు క్లైమాక్స్‌ను పూర్తి చేస్తార‌ట‌. త‌ర్వాతే రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌స్తుంద‌ని స‌మాచారం. అయితే ప్ర‌స్తుతం సినిమాను ఆగ‌స్టులో విడుద‌ల చేయ‌డానికి యూనిట్ ప్లాన్ చేస్తుంద‌ని న్యూస్ టాలీవుడ్‌లో విన‌ప‌డుతుంది.