బ్రేకప్‌పై మహేశ్‌బాబు సోదరి ఆసక్తికర ట్వీట్!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు సోదరి మంజలు ఘట్టమనేని సుపరిచితురాలే. మహేశ్ కెరీర్‌ను మలుపు తిప్పి సూపర్‌స్టార్‌గా చేసిన ‘పోకిరి’ సినిమాకు ఈమె నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత ఒకట్రెండు సినిమాలకు కూడా ఈమె నిర్మాతగా పనిచేశారు. ఆ తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్న మంజలు.. ఘట్టమనేని అభిమానులకు మాత్రం సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటోంది.
త్వరలో వాలెంటైన్స్ డే ఉండటంతో ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ చూసిన ఘట్టమనేని అభిమానులు అసలేం జరిగింది మేడమ్.. అని అడుగుతుండగా.. మరికొందరు మాత్రం సూపర్బ్ అని కితాబిస్తున్నారు. ‘బ్రేకప్‌లు ఎల్లప్పుడూ కఠినమైనవి. కానీ మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనవి. భవిష్యత్తులో జీవితం ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది.. అవన్నీ మన మదిలో ఉండిపోతాయ్’ అని మంజుల తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
Breakups are always tough. But it’s important to cherish the past and look ahead to the future. Life is full of surprises and it just may have something better in store for you!#manjulaghattamaneni #valentine #relationships #singleandhappy #singlelife pic.twitter.com/hTzbgJld22
— Manjula Ghattamaneni (@ManjulaOfficial) February 6, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com