సుక్కుకు మహేశ్ సడన్ షాక్.. ఆనందంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. ఈ మూవీ అయిపోగానే సుకుమార్ కాంబినేషన్‌లో మూవీ చేసేందుకు మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ఇందుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయిందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా సుక్కుతో సినిమా ఉంటుందని చెప్పిన మహేశ్.. మహర్షి తర్వాత అని చెప్పలేదు. దీంతో కొంచెం ఆలస్యమైనా సినిమా మాత్రం కచ్చితంగా ఉంటుందని అభిమానులు, సినీప్రియులు భావించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇంకో మూవీ రావాలని.. ఆ సినిమా ఎవరూ ఊహించనంతగా సూపర డూపర్ హిట్ కావాలని అభిమానులతో పాటు మిగతా సినీ ప్రేమికులు కూడా ఎంత గానో కోరుకున్నారు. అయితే శివరాత్రి పూట అభిమానులకు ట్విట్టర్ వేదికగా మహేశ్ ఊహించని షాకిచ్చారు.
ట్వీట్ సందేశం ఇదీ..
"సృజనాత్మక పరమైన విభేదాల కారణంగా సుకుమార్‌తో నేను చేయాలనుకున్న మూవీ ఆగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్రస్తుతానికి చెయ్యడం లేదు. ప్రస్తుతం సుక్కు ఒప్పుకున్న కొత్త ప్రాజెక్టుకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ‘1’నేనొక్కడినే సినిమా తీసినప్పుడు సుకుమార్‌తో ప్రతీ మూమెంట్‌ను నేను ఎంజాయ్ చేసాను.. ఇది ప్రత్యేకమైన చిత్రంగా మిగిలిపోతుంది. ఓ ఫిల్మ్ మేకర్‌గా ఆయనంటే ఎప్పటికీ నాకు గౌరవం ఉంటుంది. మీ నెక్స్ట్ మూవీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని మహేష్ షాకింగ్ ట్వీట్ పెట్టారు. దీంతో సూపర్‌స్టార్ అభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మున్ముంథు అయినా సినిమా ఉంటుందో లేకుంటే నేనొక్కడితోనే ఫుల్‌స్టాప్ పడుతుందో వేచి చూడాల్సిందే మరి.
అఫిషియల్‌గా ప్రకటన వచ్చేసింది..
మహేష్ బాబు స్థానంలో హీరోగా అల్లు అర్జున్ అని సుక్కు ఫిక్స్ అయిపోయారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా బన్నీ అభిమానులకు, మెగా ఫ్యాన్స్‌కు సుకుమార్ తియ్యటి శుభవార్త చెప్పారు. తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్‌తో చేయబోతున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించేశారు. మైత్రీ మూవీస్ మేకర్స్ ఈ మూవీకి కర్త, కర్మ, క్రియ అని తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. సుక్కు చెప్పిన శుభవార్తతో బన్నీ, మెగాభిమానులు ఆనందంతో మునిగితేలుతున్నారు. అయితే స్టోరీ పాతదేనా..? మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా..? లేకుంటే మహేశ్‌కు చెప్పిన స్టోరీకి పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com