పిల్ల‌ల‌కు కావాల్సిందే ప్రేమే అంటున్న మ‌హేష్..!

  • IndiaGlitz, [Monday,November 14 2016]

న‌వంబ‌ర్ 14 జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రు పుట్టిన‌రోజు..! ఈరోజునే చిల్డ్ర‌న్స్ డే గా జ‌రుపుకుంటున్నాం అనే విష‌యం తెలిసిందే..! ఈ సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...పిల్ల‌కు కావాల్సింది ప్రేమే. ఆ ప్రేమ‌ను అందిస్తే వారు మ‌రింత ప్రేమ‌గా, స్వేచ్చ‌గా విహ‌రించ‌డం చూడ‌గ‌లుగుతాం అంటూ చిన్నారుల‌కు చిల్డ్ర‌న్స్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌చేసారు.

శ్రీమంతుడు సినిమాలో మ‌హేష్ చిన్నారుల‌తో ఓ స‌న్నివేశంలో న‌టించారు. అలాగే మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న తాజా చిత్రంలో కూడా చిన్నారుల‌తో క‌లిసి మ‌హేష్ ఓ స‌న్నివేశంలో న‌టించారు. ఈ స‌న్నివేశాన్ని భాష్యం స్కూల్ కు చెందిన సుమారు 2,500 మంది విద్యార్థినీవిద్యార్ధులుతో చిత్రీక‌రించారు. ఈ చిన్నారుల‌కు మ‌హేష్ దీపావ‌ళి కానుక‌గా గిఫ్ట్ లు కూడా ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈరోజు చిన్నారుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌చేసి చిన్నారుల‌తో ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేసాడు సూప‌ర్ స్టార్..!

More News

బాహుబ‌లి కామిక్ బుక్ వ‌చ్చేసింది..!

ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన తెలుగు సినిమా బాహుబ‌లి. ద‌ర్శ‌క‌థీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో బాహుబ‌లి 2 చిత్రం పై అంచ‌నాలు భారీ స్ధాయిలో ఉన్నాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే బాహుబ‌లి 2 చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు.

నిర్మాణాంతర కార్యక్రమాల్లో విజయ్ సేతుపతి 'డా.ధర్మరాజు ఎం.బి.బి.ఎస్'

డిఫరెంట్ మూవీస్ తో తమిళంలో వరుస విజయాలో దూసుకెళ్తున్న హీరో విజయ్ సేతుపతి 'పిజ్జా' సినిమాతో

సాయిధరమ్ తేజ్ కెరీర్ కు రెండేళ్లు..!

మెగాస్టార్ మేనల్లుడుగా సినీ రంగంలో ప్రవేశించిన యువ హీరో సాయిధరమ్ తేజ్.పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన తేజు ఈరోజుకి హీరోగా రెండేళ్లు పూర్తి చేసుకున్నాడు.

విక్టరీ వెంకటేష్ నోబెల్ వర్క్...

విక్టరీ వెంకటేష్ ఇప్పుడు గురు సినిమాతో బిజీగా ఉన్నాడు.

జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్..!

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో శ్రీనివాస‌రెడ్డి న‌టించిన తాజా చిత్రం జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా. ఈ చిత్రంలో శ్రీనివాస‌రెడ్డి, పూర్ణ జంట‌గా న‌టించారు.  ఈ చిత్రాన్ని శివ‌రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై శివ‌రాజ్ క‌నుమూరి స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నారు.