పిల్లలకు కావాల్సిందే ప్రేమే అంటున్న మహేష్..!
Send us your feedback to audioarticles@vaarta.com
నవంబర్ 14 జవహర్ లాల్ నెహ్రు పుట్టినరోజు..! ఈరోజునే చిల్డ్రన్స్ డే గా జరుపుకుంటున్నాం అనే విషయం తెలిసిందే..! ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ లో స్పందిస్తూ...పిల్లకు కావాల్సింది ప్రేమే. ఆ ప్రేమను అందిస్తే వారు మరింత ప్రేమగా, స్వేచ్చగా విహరించడం చూడగలుగుతాం అంటూ చిన్నారులకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియచేసారు.
శ్రీమంతుడు సినిమాలో మహేష్ చిన్నారులతో ఓ సన్నివేశంలో నటించారు. అలాగే మురుగుదాస్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రంలో కూడా చిన్నారులతో కలిసి మహేష్ ఓ సన్నివేశంలో నటించారు. ఈ సన్నివేశాన్ని భాష్యం స్కూల్ కు చెందిన సుమారు 2,500 మంది విద్యార్థినీవిద్యార్ధులుతో చిత్రీకరించారు. ఈ చిన్నారులకు మహేష్ దీపావళి కానుకగా గిఫ్ట్ లు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు చిన్నారులకు శుభాకాంక్షలు తెలియచేసి చిన్నారులతో ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేసాడు సూపర్ స్టార్..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com