'సర్కారు వారి పాట' ఫస్ట్ లుక్ అదిరింది.. కారు అద్దాలు పగిలిపోయాయి
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ కోసం మహేష్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: సునీల్ పాత్రలో బిగ్ ట్విస్ట్.. అంచనాలు పెంచేస్తున్న 'పుష్ప'
ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించినట్లుగా చిత్ర యూనిట్ నేడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ లో మహేష్ స్టైలిష్ లుక్ తో పాటు, మాస్ యాటిట్యూడ్ అదిరిపోయాయి అని చెప్పాలి. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు సరికొత్త హెయిర్ స్టైల్ లో కనిపిస్తున్నాడు.
రెడ్ కారులో డోర్ తీస్తూ మహేష్ కూర్చుని ఉన్న స్టైల్ అదిరిపోయిందనే చెప్పాలి. కారు అద్దాలు కూడా పగిలిపోయి ఉన్నాయి. బహుశా యాక్షన్ సీన్ కి సంబందించిన లుక్ అయి ఉండవచ్చు. మహేష్ లుక్ లో చెవి పోగు, మెడపై టాటూ గమనించవచ్చు.
ముందుగా ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా డేట్ కూడా ఖరారు చేశారు. జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా ప్రకటించారు. ఓవరాల్ గా సర్కారు వారి పాట లుక్ అదిరిపోయింది. మహేష్ అభిమానులకు మాస్ ట్రీట్ ముందు ఉంది అని హామీ ఇచ్చేలా లుక్ ఉంది.
ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమన్ సంగీత దర్శకుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com