కరోనాతో టాలీవుడ్ దర్శకుడి మృతి

  • IndiaGlitz, [Saturday,May 01 2021]

క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ సెకండ్ వేవ్‌లో మ‌రింత వేగంగా విస్తరిస్తోంది. దేశంలో దాదాపు లక్షల్లో కేసులు.. లెక్కకు అందని మరణాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఇక ప్రముఖ రాజకీయ నేతలు, సెలబ్రిటీలంతా కరోనా బారిన పడుతున్నారు. చాలా మంది ప్రముఖులు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. తాజాగా టాలీవుడ్ దర్శకుడు ఒకరు కరోనా బారిన పడి మృతి చెందారు. శుక్ర‌వారం క‌రోనా కార‌ణంగా శ్రీవిష్ణుతో ‘మా అబ్బాయి’ సినిమాను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు కుమార్ వ‌ట్టి క‌న్నుమూశారు. కొన్నిరోజుల ముందు ఆయ‌నకు కరోనా సోకడంతో హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. కుమార్ మరణంతో టాలీవుడ్ షాక్‌కు గురైంది.

ఈటలపై వేటుకు రంగం సిద్ధం..

కుమార్ వ‌ట్టి స్వ‌స్థ‌లం శ్రీకాకుళం జిల్లాలోని న‌ర్స‌న్న‌పేట‌. ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేశారు. 2017లో ‘మా అబ్బాయి’ చిత్రంతో దర్శకుడిగా మారారు. కుమార్ వట్టి తొలుత పరుశురాం వద్ద అసిస్టెంట్‌గా పని చేశారు. యువత సినిమా కోసం పరుశురాం వద్ద కుమార్ వట్టి పని చేశారు. ఆ తరువాత ‘సోలో’ సినిమాకు కూడా పనిచేశారు. ఆ సమయంలోనే కుమార్ వట్టికి శ్రీ విష్ణుతో పరిచయం అయిందని తెలుస్తోంది. తాను దర్శకుడిగా మారితే తన హీరో కచ్చితంగా శ్రీ విష్ణు అని అప్పుడే ఫిక్స్ అయ్యారట. అలా అనుకున్న ప్రకారమే ‘మా అబ్బాయి’ సినిమాతో కుమార్ వట్టి దర్శకుడిగా మారారు. ‘సర్కారు వారి పాట’ సినిమాకు అసోసియేట్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకడం.. ప్లాస్మా ఎక్కించినప్పటికీ ఫలితం దక్కలేదు.

More News

ఈటలపై వేటుకు రంగం సిద్ధం.. సీబీఐతో విచారణ జరిపించాలన్న మంత్రి

ప్రభుత్వ ధిక్కార స్వరానికి త్వరలోనే వేటు పడబోతోందని తెలుస్తోంది. నిజానికి మంత్రులంటే ఎలా ఉండాలి? ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు,

అమెరికా సాయం భారత్‌కు చేరింది: యూఎస్ ఎంబసీ

ప్రస్తుతం భారత్‌లో హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో అత్యవసరమైన ఆక్సిజన్ కొరతతో పాటు టెస్టింగ్ కిట్లు, పీపీఈ కొట్ల కొరత దేశాన్ని కుదిపేస్తోంది.

మరో తమిళ రీమేక్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్..

2019లో ధనుష్ ప్రధాన పాత్రలో రూపొంది.. మంచి సక్సెస్ సాధించిన తమిళ చిత్రం 'రాక్షసన్‌'ను

రానా మరో పాన్ ఇండియా సినిమా

'లీడర్', 'కృష్ణంవందే జగద్గురుమ్', 'బాహుబలి', 'ఘాజీ', 'నేనే రాజు నేనే మంత్రి' - కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కథలు, విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకొనే కథానాయకుడు రానా దగ్గుబాటి.

కొవిడ్‌ వచ్చిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు?: ఏపీ హైకోర్టు ఫైర్

ఓవైపు కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు పదో తరగతితో పాటు ఇంటర్ పరీక్షలను రద్దు చేయడమో లేదంటే వాయిదా