కరోనాతో టాలీవుడ్ దర్శకుడి మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ విజృంభణ సెకండ్ వేవ్‌లో మరింత వేగంగా విస్తరిస్తోంది. దేశంలో దాదాపు లక్షల్లో కేసులు.. లెక్కకు అందని మరణాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఇక ప్రముఖ రాజకీయ నేతలు, సెలబ్రిటీలంతా కరోనా బారిన పడుతున్నారు. చాలా మంది ప్రముఖులు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. తాజాగా టాలీవుడ్ దర్శకుడు ఒకరు కరోనా బారిన పడి మృతి చెందారు. శుక్రవారం కరోనా కారణంగా శ్రీవిష్ణుతో ‘మా అబ్బాయి’ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు కుమార్ వట్టి కన్నుమూశారు. కొన్నిరోజుల ముందు ఆయనకు కరోనా సోకడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. కుమార్ మరణంతో టాలీవుడ్ షాక్‌కు గురైంది.
కుమార్ వట్టి స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేట. దర్శకుడు పరశురామ్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. 2017లో ‘మా అబ్బాయి’ చిత్రంతో దర్శకుడిగా మారారు. కుమార్ వట్టి తొలుత పరుశురాం వద్ద అసిస్టెంట్‌గా పని చేశారు. యువత సినిమా కోసం పరుశురాం వద్ద కుమార్ వట్టి పని చేశారు. ఆ తరువాత ‘సోలో’ సినిమాకు కూడా పనిచేశారు. ఆ సమయంలోనే కుమార్ వట్టికి శ్రీ విష్ణుతో పరిచయం అయిందని తెలుస్తోంది. తాను దర్శకుడిగా మారితే తన హీరో కచ్చితంగా శ్రీ విష్ణు అని అప్పుడే ఫిక్స్ అయ్యారట. అలా అనుకున్న ప్రకారమే ‘మా అబ్బాయి’ సినిమాతో కుమార్ వట్టి దర్శకుడిగా మారారు. ‘సర్కారు వారి పాట’ సినిమాకు అసోసియేట్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకడం.. ప్లాస్మా ఎక్కించినప్పటికీ ఫలితం దక్కలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments