మహేశ్ లేకుండానే ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రారంభం..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శుక్రవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ప్రారంభించారు. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, నటి రష్మిక మందన్నాతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా మహేశ్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.. మహేశ్ లేకుండానే షూటింగ్ ప్రారంభించేయడం గమనార్హం.
మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజే ఈ కొత్త సినిమాను ప్రారంభించడం విశేషమని చెప్పుకోవచ్చు. కృష్ణ పుట్టినరోజును పురష్కరించుకుని గురువారం రాత్రే ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర నిర్మాణంలో మహేష్ బాబు కూడా పాలుపంచుకుంటున్నారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం యోచనలో ఉంది.
కాగా.. సినిమా టైటిల్ పోస్టర్‌ను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో మహేష్ బాబు సైనికుడిగా కనిపించనున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఏకే 47 గన్, దానిపై సైనికులు పెట్టుకునే హెల్మెట్‌ను టైటిల్ అందులో ఉన్నాయి. మహేశ్ సైనికుడు సినిమా ఆశించినంతగా సక్సెస్ కాలేదన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సైనికుడు పాత్రలో మహేశ్ తన అభిమానులను ఏ మాత్రం మెప్పిస్తాడో వేచి చూడాల్సిందే. మరోవైపు ‘F2’తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న అనిల్ రావిపూడి.. మహేష్ బాబుతో ఇంకెలాంటి హిట్టు కొడతారో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక విభాగాన్ని ఇంకా ప్రకటించలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments