మహేశ్‌ లేకుండానే ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రారంభం..

  • IndiaGlitz, [Friday,May 31 2019]

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శుక్రవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ప్రారంభించారు. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, నటి రష్మిక మందన్నాతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా మహేశ్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.. మహేశ్ లేకుండానే షూటింగ్ ప్రారంభించేయడం గమనార్హం.

మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజే ఈ కొత్త సినిమాను ప్రారంభించడం విశేషమని చెప్పుకోవచ్చు. కృష్ణ పుట్టినరోజును పురష్కరించుకుని గురువారం రాత్రే ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర నిర్మాణంలో మహేష్ బాబు కూడా పాలుపంచుకుంటున్నారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం యోచనలో ఉంది.

కాగా.. సినిమా టైటిల్ పోస్టర్‌ను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో మహేష్ బాబు సైనికుడిగా కనిపించనున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఏకే 47 గన్, దానిపై సైనికులు పెట్టుకునే హెల్మెట్‌ను టైటిల్‌ అందులో ఉన్నాయి. మహేశ్ సైనికుడు సినిమా ఆశించినంతగా సక్సెస్ కాలేదన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సైనికుడు పాత్రలో మహేశ్ తన అభిమానులను ఏ మాత్రం మెప్పిస్తాడో వేచి చూడాల్సిందే. మరోవైపు ‘F2’‌తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న అనిల్ రావిపూడి.. మహేష్ బాబుతో ఇంకెలాంటి హిట్టు కొడతారో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక విభాగాన్ని ఇంకా ప్రకటించలేదు.

More News

మహర్షి చిత్రం 100 కోట్ల షేర్‌ దాటి సూపర్‌ కలెక్షన్స్‌తో చాలా స్ట్రాంగ్‌గా రన్‌ అవుతోంది - దిల్‌ రాజు

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా అందించిన 'మహర్షి'

వైఎస్‌ను మించి.. మళ్లీ మళ్లీ జగనే సీఎం!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో వైసీపీ గెలుపొందగా.. ఫ్యాన్ గాలికి అటు సైకిల్ గానీ ఇటు గ్లాస్ కానీ దరిదాపుల్లోకి రాలేకపోయాయి.

ప్రధానిగా రెండోసారి మోదీ ప్రమాణం.. 2.0 టీమ్ ఇదే..

నరేంద్ర మోదీ రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో సరిగ్గా సాయంత్రం 7గంటలకు ఈ మహోత్తర కార్యక్రమం జరిగింది.

జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వీళ్లంతా ఎందుకు రాలేదు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో విజయడంఖా మోగించి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

ఈద్‌కి 'సాహో' స్పెష‌ల్ గిఫ్ట్

ఈద్‌.. ముస్లిం సోద‌రులు ఘ‌నంగా చేసుకునే పండుగ‌. ఈ పండుగ‌కు ముస్లిం సోద‌రుల‌ను ఖుష్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు ప్ర‌భాస్‌.