మ‌హేష్ బ‌ర్త్ డే కి గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న మురుగుదాస్..

  • IndiaGlitz, [Tuesday,July 26 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ ఈ నెల 29నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఆగ‌ష్టు 1 నుంచి మ‌హేష్ బాబు షూటింగ్ లో పాల్గొంటారు.

అయితే...ఆగ‌ష్టు 9న మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు కావ‌డంతో...ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయాల‌ని మురుగుదాస్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ విష‌యం పై త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం. హైద‌రాబాద్, చెన్నై, ముంబాయి, పూణే, గుజ‌రాత్ ల‌లో షూటింగ్ చేయ‌నున్నారు. తెలుగు, త‌మిళ్ లో భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.