విజయశాంతే ఆ పాత్రకు కరెక్ట్.. నాన్నగారు సర్‌ప్రైజ్!
Send us your feedback to audioarticles@vaarta.com
‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం ఎల్లుండి అనగా.. జనవరి 11న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవుతుంది. ప్రమోషన్‌లో భాగంగా సరిలేరు ఇంటర్వ్యూలో గురించి పలు ఆసక్తికర విషయాలను మహేశ్ వెల్లడించారు. ఈ క్రమంలో లేడీ అమితాబ్ విజయశాంతి అలియాస్ రాములమ్మ గురించి ప్రస్తావన రాగా.. తన మనసులోని మాటను మహేశ్ బయటపెట్టారు.
ప్రశ్న : చాలాకాలం తర్వాత విజయశాంతితో మళ్లీ వర్క్ చేయడం ఎలా అన్పించింది?
మహేశ్ : అమేజింగ్ ఫీలింగ్. ఆమెతో ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమా చేశాను. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫ్లైట్‌లో కలిశాం తప్ప టచ్‌లో లేను. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఫస్ట్‌డే షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలాకాలం తర్వాత మళ్లీ చేస్తున్నాను అనే ఫీల్ ఉంది. కానీ ఒక షాట్ చేయగానే ‘కొడుకు దిద్దిన కాపురం’ షూటింగ్ నిన్ననే జరిగినట్లు అనిపించింది. ఆవిడ తప్ప ఈ క్యారెక్టర్‌ని అంత బాగా ఎవరూ చేయలేరు. ఆమె ఈ క్యారెక్టర్ చేయడం ఈ సినిమాకి, మా టీమ్‌కి పెద్ద అడ్వాంటేజ్ అయ్యింది. ఆమెకి ఈ సందర్భంగా థాంక్స్ తెలియజేస్తున్నాను’ అని మహేశ్ చెప్పుకొచ్చారు.
ప్రశ్న: ఈ సినిమాలో కృష్ణగారు కనిపిస్తారు అని దర్శకుడు అనిల్ చెప్పారు?
మహేశ్ : అది సినిమాలో ఒక సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్. మా అందరికి చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది అని మహేశ్ ఈ ఇంటర్వ్యూ వేదికగా తన మనసులోని మాటలను బయటపెట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com