2.ఓ ట్రైలర్ పై మహేష్ బాబు స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న రజినీకాంత్ 2. ఓ చిత్రం ట్రైలర్ గురించి తాజాగా స్పందించారు. "అబ్బురపరిచే సన్నివేశాలతో ఉన్న ట్రైలర్ ని చూస్తుంటే వెండి తెరపై చిట్టి ని చూడటానికి వెయిట్ చేయలేకపోతున్నాను' అంటూ ట్వీట్టర్ వేదికగా మహేష్ అన్నారు.
అలాగే ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు, దర్శకుడు శంకర్ కు, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కు మరియు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
విజువల్ వండర్ గా తెరకెక్కిన 2. ఓ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలై సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హాట్ భామ అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Stunning visuals and incredible concept! Can’t wait for Chitti to set the screens on fire ?? Best wishes to @shankarshanmugh, @rajinikanth sir, @akshaykumar, @arrahman, and the entire team!????#2point0https://t.co/JC8sY5NkH1
— Mahesh Babu (@urstrulyMahesh) November 5, 2018
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments