హీరోయిన్‌ను వెతకాలని ఫ్యాన్స్‌కు మహేశ్ రెక్వెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రెండ్రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా మంచి హిట్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగానూ.. ‘సరిలేరు నాకెవ్వరూ’ అంటూ దూసుకెళ్తోంది. మరోవైపు సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడంతో మహేశ్ ఫ్యాన్స్, చిత్రబృందం ఆనందంలో మునిగి తేలుతోంది. ఈ సందర్భంగా మహేష్, దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి క్యూ అండ్ ఏ సెషన్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలను అనిల్ రావిపూడి వింటుంటే.. మహేష్ గ్యాప్ లేకుండా టకటకా సమాధానాలచ్చారు.
మీరే వెతకండి!
ఈ క్రమంలో ఓ వీరాభిమాని.. ‘అన్నా మీ తర్వాతి సినిమాలో హీరోయిన్ ఎవరు?’ అని అడిగాడు. ఇందుకు మహేశ్ స్పందిస్తూ.. ‘తెలీదండి. కుదిరితే మీరే వెతికిపెట్టండి’ అని బదులిచ్చారు. మరి ఫ్యాన్స్ ఫలానా హీరోయిన్ అని చెబితే నిజంగానే మహేశ్ ఆ బ్యూటీని తీసుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది. కాగా తన తదుపరి సినిమా ‘మహర్షి’గా చూపించి హిట్టిచ్చిన వంశీ పైడిపల్లితో ఉంటుందని ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో మహేశ్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఫాన్ ఇండియా మూవీ గురించి..!
అభిమాని : ప్యాన్ ఇండియా సినిమా ఎప్పుడు తీస్తారు?
మహేశ్ : ‘మనం మంచి సినిమాలు చేసుకుంటూపోతే అవే ప్యాన్ ఇండియా స్థాయికి వెళ్తాయి. అంతే కానీ ప్యాన్ ఇండియా అని అనుకుని తీయకూడదనేది నా అభిప్రాయం’ అని మహేశ్ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments