మరో అందం వెనుక అసలు కారణం చెప్పిన మంచు హీరో.. మహేశ్ రిప్లై
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ హ్యండ్సమ్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ మహేశ్ యంగ్‌గా మారిపోతున్నాడు. ఇప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న కుర్ర హీరోలు సైతం మహేశ్ ముందు బలాదూర్ అనిపించేస్తున్నారు మరి. టాలీవుడ్ ఏంటి బాలీవుడ్ స్టార్స్ సైతం మన మహేశ్‌బాబుని చూసి ఫిదా అయినవారే. అయితే మహేశ్ అందం వెనుక మాత్రం ఎవరూ సీక్రెట్‌ను చెప్పలేకపోతున్నారు. అయితే ఓ హీరో మాత్రం మహేశ్ అందం వెనకున్న సీక్రెట్‌ను రివీల్ చేశాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. మంచు విష్ణు. రీసెంట్గా మంచు విష్ణు తన సతీమణి వెరోనికా బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేశాడు. ఈ వేడుకలకు సినీ స్టార్స్ కూడా హాజరయ్యారు. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి హీరో మహేశ్, నమత్ర, హీరో గోపీచంద్ తదితరులు హాజరయ్యారు. మహేశ్, గోపీచంద్‌లతో ఉన్న ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన మంచు విష్ణు..
"ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి వయసు పెరుగుతున్న కొద్దీ యంగ్‌గా మారిపోతున్నాడు..తనలోని మంచితనమే తన అందానికి కారణమని నేను నమ్ముతున్నాను" అంటూ విష్ణు ట్వీట్ చేయగా, దానికి విష్ణు రిప్లై ఇస్తూ "ఇంత మంచి అతిథ్యమిచ్చినందుకు థాంక్స్" అంటూ రిప్లై ట్వీట్ ఇచ్చాడు మహేశ్. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేశ్ తన 27వ చిత్రం 'సర్కారు వారి పాట'తో బిజీగా ఉండగా, మంచు విష్ణు 'మోసగాళ్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సమాయత్తమవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com