మరో అందం వెనుక అసలు కారణం చెప్పిన మంచు హీరో.. మహేశ్‌ రిప్లై

  • IndiaGlitz, [Saturday,January 16 2021]

టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌ హ్యండ్‌సమ్‌ నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ మహేశ్‌ యంగ్‌గా మారిపోతున్నాడు. ఇప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న కుర్ర హీరోలు సైతం మహేశ్‌ ముందు బలాదూర్‌ అనిపించేస్తున్నారు మరి. టాలీవుడ్‌ ఏంటి బాలీవుడ్‌ స్టార్స్‌ సైతం మన మహేశ్‌బాబుని చూసి ఫిదా అయినవారే. అయితే మహేశ్‌ అందం వెనుక మాత్రం ఎవరూ సీక్రెట్‌ను చెప్పలేకపోతున్నారు. అయితే ఓ హీరో మాత్రం మహేశ్‌ అందం వెనకున్న సీక్రెట్‌ను రివీల్‌ చేశాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. మంచు విష్ణు. రీసెంట్‌గా మంచు విష్ణు తన సతీమణి వెరోనికా బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్‌ చేశాడు. ఈ వేడుకలకు సినీ స్టార్స్ కూడా హాజరయ్యారు. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి హీరో మహేశ్‌, నమత్ర, హీరో గోపీచంద్ తదితరులు హాజరయ్యారు. మహేశ్‌, గోపీచంద్‌లతో ఉన్న ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్‌ చేసిన మంచు విష్ణు..

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి వయసు పెరుగుతున్న కొద్దీ యంగ్‌గా మారిపోతున్నాడు..తనలోని మంచితనమే తన అందానికి కారణమని నేను నమ్ముతున్నాను అంటూ విష్ణు ట్వీట్‌ చేయగా, దానికి విష్ణు రిప్లై ఇస్తూ ఇంత మంచి అతిథ్యమిచ్చినందుకు థాంక్స్‌ అంటూ రిప్లై ట్వీట్‌ ఇచ్చాడు మహేశ్‌. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేశ్‌ తన 27వ చిత్రం 'సర్కారు వారి పాట'తో బిజీగా ఉండగా, మంచు విష్ణు 'మోసగాళ్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సమాయత్తమవుతున్నారు.

More News

నిర్మాతను హర్ట్‌ చేసిన నమ్రత శిరోద్కర్‌

మాజీ హీరోయిన్‌, మహేశ్‌ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ ఓ నిర్మాతను హార్ట్‌ చేసిందా? కావాలనే అలా జరిగిపోయిందో తెలియదు కానీ..

పీఎం నుంచి సీఎం వరకూ ఒక్కరూ ముందుకు రారే.. వీళ్లవేనా ప్రాణాలు?

ఏడాది కాలంగా ప్రజానీకాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారికి మందు వచ్చేసింది. నేటి నుంచి దేశ వ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

వెనక్కి తగ్గిన వాట్సాప్.. కొత్త ప్రైవసీ పాలసీ విధానం వాయిదా..

కొత్త ప్రైవసీ పాలసీపై ప్రఖ్యాత మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెనక్కి తగ్గింది. మూడు నెలల పాటు దీనిని వాయిదా వేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.

`ప‌వ‌ర్ ప్లే` ఫ‌స్ట్‌లుక్, మోష‌న్ పోస్ట‌ర్‌

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`.

పవన్‌ సినిమాకు సాయి పల్లవి నో చెబుతుందా?

సాయి పల్లవి.. యాక్టింగ్ విషయంలో కూడా సింగిల్ పీసే.. కొన్ని పాత్రలు ఆమెలా ఏ హీరోయిన్ కూడా చేయలేదు.